సూడాన్ ప్రధాని అబ్దుల్లా రాజీనామా

సూడాన్ ప్రధాని అబ్దుల్లా రాజీనామా

కైరో: సూడాన్ ప్రధాని అబ్దుల్లా హమ్​దోక్ రాజీనామా చేశారు. ఆర్మీ తిరుగుబాటుతో రాజకీయ ప్రతిష్టంభన కారణంగా రిజైన్ చేసినట్లు ప్రకటించారు. అంతకుముందు ఆదివారం సైనిక తిరుగుబాటును నిరసిస్తూ వేలాదిగా జనం రోడ్డెక్కారు. పరిస్థితిని అదుపు చేసేందుకు సెక్యూరిటీ ఫోర్స్ టియర్​ గ్యాస్ ప్రయోగించాయి. ఫైరింగ్ కూడా జరగడంతో ఇద్దరు సిటిజన్స్  చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. ఈ పరిణామాల తర్వాత జరిగిన ఒప్పందం ప్రకారం ప్రధానమంత్రిని తిరిగి నియమించింది సైన్యం. అయితే రానురాను ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమాన్ని పక్కదారి పట్టించి ప్రధాని రాజీనామాకు దారి తీసేలా చేసింది.