కుక్క అడ్డురావడంతో సడెన్ బ్రేక్.. బైక్ స్కిడ్ అయి రైతు మృతి

కుక్క అడ్డురావడంతో సడెన్ బ్రేక్.. బైక్ స్కిడ్ అయి రైతు మృతి
  • రంగారెడ్డి జిల్లాలో ఘటన 

శంకర్‌‌‌‌పల్లి, వెలుగు: బైక్ స్కిడ్ అయి కింద పడి రైతు చనిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లా మోకిల పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాబ్ పేట మండలం పులిమామిడి గ్రామానికి చెందిన శ్రీనివాస్ (38) అనే రైతు సోమవారం బైక్ పై హైదరాబాద్ వెళ్లాడు. మంగళవారం తిరిగి సొంతూరికి బయలుదేరాడు. శంకర్ పల్లి మండల పొద్దుటూరు గేట్ వద్ద కుక్క అడ్డు రావడంతో సడెన్ బ్రేక్ వేశాడు. బైక్ స్కిడ్ అయి శ్రీనివాస్ కిందపడిపోయాడు. అతడి తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ శ్రీనివాస్ మృతి చెందాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.