ఛార్జింగ్ పెట్టిన సెల్ఫోన్ పేలి..నలుగురు చిన్నారులు మృతి

ఛార్జింగ్ పెట్టిన సెల్ఫోన్ పేలి..నలుగురు చిన్నారులు మృతి

మీరట్: ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఓ ఇంట్లో సెల్ ఫోన్ పేలడంతో కుటుంబం బలైంది.ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు..వారి తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉంచగా షార్ట్ సర్క్యూట్ తో మొబైల్ పేలింది. దీంతో ఇళ్లంతా మంటలు వ్యాపించారు. ఈ ప్రమాదంలో ఓ కుటుంబం మొత్తం కాలిపోయింది. శనివారం (మార్చి 23) రాత్రి పల్లవపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జనతాకాలనీలో ఈ ఘటన జరిగింది. 

ముజఫర్ నగర్ కు చెందిన జానీ కుటుంబం జనతా కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. జానీ  కూలీ గా పనిచేస్తున్నాడు. శనివారం హోలీ పండగ  సందర్భంగా జాని భార్య బబిత ఇంట్లో వంట చేస్తోంది. జానీ కుమార్తెలు సారిక(10), నిహారిక(8), కుమారుడు గోలు(6),మరో కుమారుడు కలు (5) గదిలో ఉన్నారు. గదిలో కరెంట్ బోర్డులో సెల్ ఛార్జింగ్ పెట్టాడు జానీ. ఛార్జర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఫోమ్ మ్యాట్రెసెస్ పై నిప్పు రవ్వలుపడి మంటలు చెలరేగాయి. 

అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో పిల్లలను రక్షించేందుకు జానీ , అతని భార్య ప్రయత్నించారు. చుట్టు పక్కల వారు వచ్చి వారిని బయటికి తీశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. నలుగురు చిన్నారులు చనిపోయారు.. జానీ , అతని భార్య బబిత తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం : ఎస్ ఎస్సీ 

పల్లవపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జనతాకాలనీలో శనివారం సాయంత్రం 5 గంటలకు షార్క్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ప్రమాదానికికారణం అయ్యింది. ఇందులో కుటుంబ సభ్యులు ఒకరినొకరు రక్షించుకునే క్రమంలో కాలిపోయారు. బాదితులు జానీ, అతని భార్య బబిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు..వారి నలుగురు పిల్లలు చనిపోయారని.. ’’  మీరట్ ఎస్ ఎస్పీ రోహిత్ సింగ్ వెల్లడించారు.