
సుధాకర్ కోమాకుల హీరోగా రూపొందిన చిత్రం ‘నారాయణ అండ్ కో’. ఆమని, దేవి ప్రసాద్ కీలకపాత్రలు పోషించారు. చిన్నా పాపిశెట్టి దర్శకుడు. జూన్ 30న సినిమా విడుదల కానున్న సందర్భంగా సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అతిథిగా హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘ట్రైలర్ హిలేరియస్‌గా ఉంది. సినిమా కూడా ఆడియెన్స్‌కి నచ్చుతుందనే నమ్మకం ఉంది. సుధాకర్ నా స్నేహితుడు. తనతో నాది లాంగ్ జర్నీ. ఈ సినిమాతో తనకి మంచి బ్రేక్ వస్తుందని భావిస్తున్నా’ అని చెప్పారు.
డైరెక్టర్ విజయ్ కనకమేడల, హీరో తిరువీర్, నిర్మాత రాజ్ కందుకూరి, ఆర్పీ పట్నాయక్ అతిథులుగా హాజరై టీమ్‌కి బెస్ట్ విషెస్ చెప్పాడు. సుధాకర్ మాట్లాడుతూ ‘దేవి ప్రసాద్, ఆమని గారు, ఆర్తి, పూజా, సప్తగిరి... అందరూ కలసి నటించిన చక్కని ఎంటర్ టైనర్ ఇది. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అన్నాడు. ‘ఇది ఫ్యామిలీ ఫండెడ్ మూవీ. చాలా మంది సపోర్ట్‌తో పూర్తి చేశాం’ అన్నారు దర్శక నిర్మాత చిన్నా. సప్తగిరి, ఆమని, దేవి ప్రసాద్, పూజా కిరణ్, ఆర్తి పొడి పాల్గొన్నారు.