సుధీర్ బాబు హరోం హర టీజర్‌ రిలీజ్

సుధీర్ బాబు హరోం హర టీజర్‌ రిలీజ్

సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హరోం హర’. సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. ఈ మూవీ  తెలుగు టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రభాస్ రిలీజ్ చేసి టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు.  సాధారణ వ్యక్తి నుంచి శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగే సుబ్రమణ్యం పాత్రలో సుధీర్ సరికొత్త లుక్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తున్నాడు.

అలాగే రాయలసీమ యాసలో  డైలాగ్స్ చెబుతూ ఆకట్టుకున్నాడు. ‘భయపడితే సింహాన్ని కూడా సేద్యానికి వాడుకుంటారు.. అది భయపెడితేనే అడివికి రాజు అని ఒళ్లు దగ్గరపెట్టుకుంటారు. వాడు సమరమే మొదలుపెడితే.. ఆ సంభవానికి సంతకం నాదయితది’ అని సుధీర్ చెప్పే డైలాగ్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి. 

సునీల్, అక్షర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.