Sudheer babu : హంట్ మూవీ ట్రైలర్ లాంఛ్

Sudheer babu : హంట్ మూవీ ట్రైలర్ లాంఛ్

టాలీవుడ్‌ యాక్టర్‌ సుధీర్‌బాబు ప్రధాన పాత్రలో, మహేశ్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ హంట్. ఇందులో భరత్‌ నివాస్‌, శ్రీకాంత్‌ మేక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇవాళ ఉదయం 10:30 కు ఏ.ఎమ్.బి. మాల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్, డైరెక్టర్ మహేష్ పాల్గొన్నారు.- పోలీస్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా జనవరి 26న థియేటర్లలోకి రాబోతోంది.

ఈ ఈవెంట్ లో సుధీర్ బాబు మాట్లాడుతూ ‘సూపర్ స్టార్ కృష్ణ చనిపోయాక ఇది నా మొదటి సినిమా. ఆయన లేని వెలితి చాలా కనిపిస్తుంది. నా ప్రతీ సినిమా ఫస్ట్ షో చూసి ఫోన్ చేసి మాట్లాడేవారు.- ఈ విషయాన్ని ఆయన చాలా మందితో చెప్పేవారట. అది నాకు గర్వంగా ఉండేది. లైఫ్ లో నేను ఎక్కడ ఉన్నా ఎంత దూరం వెళ్లినా.. నా జీవితం ఆయనకే అంకితం. శ్రీకాంత్ గారి నుంచి నేను చాలా నేర్చుకోవాలి. ఆయన సెట్ లో చాలా కూల్ గా ఉంటాడు. ఎప్పడు క్యాండీ క్రష్ అడుతుంటాడు. భరత్ నాకన్నా చిన్నోడే అయినా ఫీల్డ్ లో నా కన్నా సీనియర్. చిన్నతనం నుంచే భరత్ సినిమాలు చూస్తూ పెరిగా. - ప్రేమిస్తే సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశాడు ’ అని అన్నాడు.