
సుదీర్ బాబు హీరోగా నటించిన సినిమా.. మామా మశ్చీంద్ర టీజర్ ను శనివారం (ఏప్రిల్ 22) లాంచ్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో సుదీర్ బాబు ట్రిపుల్ రోల్ లో రాబోతున్నాడు. యాంగర్, లవర్ బాయ్, ఫ్యాట్ బాయ్ రోల్స్ తో ఈ సినిమాలో అలరించబోతున్నాడు.
టీజర్ లోని పాత్రల ప్రకారం కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ షేడ్స్ ఉన్నాయి. కానీ, కథాంశం మాత్రం కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ నిర్మించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు.