ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన 'గాలోడు'

ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన 'గాలోడు'

బుల్లితెరపై కమెడియన్‌గా,  హోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అలరిస్తున్న సుడిగాలి సుధీర్, హీరోగానూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ‘గాలోడు’ చిత్రం ఒకటి.  రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడు. గెహాన సిప్పి హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది.  నిన్న ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఇందులో సుధీర్ మాస్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెస్మరైజ్ చేస్తున్నాడు. ‘మా ఊళ్లో నన్ను కుర్రాడు అనరు. కొవ్వోడు అంటారు’ అంటూ తన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పరిచయం చేశాడు.

అలాగే  ‘వాడిది మామూలు రేంజ్ కాదు మాఫియా రేంజ్, సైనైడ్, యాసిడ్ కంటే డేంజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రా వాడు.  రాక్షసుల గురించి పుస్తకాల్లో చ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దివాను, విన్నాను మొట్టమొద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టి సారి వీడిలో చూశాను సార్’ అనే డైలాగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాత్రపై క్యూరియాసిటీ పెంచారు. తను చేసిన యాక్షన్  ఎపిసోడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు డ్యాన్స్ మూమెంట్స్ హైలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నాయి. గెహాన, సప్తగిరి, షకలక శంకర్ కామెడీ ట్రాక్ కూడా బాగుంది. మొత్తానికి ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సినిమాపై ఇంటరెస్ట్ క్రియేట్ చేశారు.