కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో పారా అథ్లెట్ల సూపర్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌

కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో పారా అథ్లెట్ల సూపర్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌

బర్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌: కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో అథ్లెట్లతో పాటు పారా అథ్లెట్లు కూడా సూపర్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ చేస్తున్నారు. పారా వెయిట్‌‌‌‌లిఫ్టర్‌‌‌‌ సుధీర్‌‌‌‌ తొలిసారి.. కామన్వెల్త్‌‌‌‌ హెవీ వెయిట్‌‌‌‌లిఫ్టింగ్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ గెలిచి చరిత్ర సృష్టించాడు. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన మెన్స్‌‌‌‌ హెవీ వెయిట్‌‌‌‌ ఫైనల్లో సుధీర్ రెండు ప్రయత్నాల్లో వరుసగా 208, 212 కేజీల బరువు ఎత్తాడు. మూడో ప్రయత్నంలో 217 కేజీల బరువును ఎత్తలేకపోయాడు. దీంతో 134.5 పాయింట్లతో గేమ్స్‌‌‌‌ రికార్డుతో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు.

మరోవైపు మెన్స్‌‌‌‌ లాంగ్‌‌‌‌జంప్‌‌‌‌లో మురళీ శ్రీశంకర్‌‌‌‌ సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌ను సాధించాడు. ఐదో ప్రయత్నంలో మురళీ 8.08 మీటర్ల దూరం దూకి రెండో ప్లేస్‌‌‌‌లో నిలిచాడు. లుకాస్‌‌‌‌ నైర్న్‌‌‌‌ (బహమాస్‌‌‌‌) కూడా 8.08 మీటర్లే దూకినా.. రెండో ఉత్తమ పెర్ఫామెన్స్‌‌‌‌ 7.98 మీటర్లుగా ఉండటంతో స్వర్ణం ఖాయమైంది. శంకర్‌‌‌‌ రెండో ఉత్తమ పెర్ఫామెన్స్‌‌‌‌ 7.84 మీటర్లుగా ఉంది.