- కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
నిజామాబాద్, వెలుగు : యాసంగి సీజన్‌కు సరిపడా 32 వేల టన్నుల యూరియా బస్తాలు నిల్వ ఉన్నాయని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం డిచ్పల్లి మండలంలోని సుద్దులం సింగిల్ విండో గోదామ్లోని యూరియా స్టాక్‌ను పరిశీలించి మాట్లాడారు. అవసరానికి మించి యూరియా కొనుగోలు చేసి సమస్య సృష్టించొద్దన్నారు.
నానో యూరియాపై రైతుల్లో ఉన్న అపోహలు తొలగిపోయేలా అగ్రికల్చర్ ఆఫీసర్లు అవగాహన కల్పించాలన్నారు. నానో ప్రయోజనాలు, డ్రోన్ల వినియోగం లాభాలను వివరించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి, తహసీల్దార్ సతీష్ తదితరులు ఉన్నారు.
