ఇథనాల్ బ్లెండింగ్‌‌‌‌‌‌‌‌తో చక్కెర మిల్లుల దశ తిరిగింది: అమిత్ షా

ఇథనాల్ బ్లెండింగ్‌‌‌‌‌‌‌‌తో చక్కెర మిల్లుల దశ తిరిగింది: అమిత్ షా
  • మోదీ చర్యలతో చక్కెర కోఆపరేటివ్ సెక్టార్​కు భారీగా లాభాలు: అమిత్ షా
  •     మహారాష్ట్ర వరద బాధిత రైతులకు సహాయం చేస్తామని హామీ

అహల్యానగర్ (మహారాష్ట్ర): ఇథనాల్ బ్లెండింగ్ వల్ల చక్కెర మిల్లుల దశ మారిపోయిందని కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత చక్కెర కోఆపరేటివ్ సెక్టర్ ఎంతో లాభపడిందన్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు కేంద్రం అన్ని రకాల సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. 

 మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలో డాక్టర్ విఠల్ రావు విఖే పాటిల్ కోఆపరేటివ్ చక్కెర ఫ్యాక్టరీ ఎక్స్​పాన్షన్​ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ చక్కెర కోఆపరేటివ్‌‌‌‌‌‌‌‌లను ఆధునికీకరించుకోవాలని చెప్పారు. ఇథనాల్ ఉత్పత్తికి ప్రభుత్వం రూ.10 వేల కోట్లు కేటాయించిందన్నారు. 

20% ఆదాయాన్ని విస్తరణకు వాడితే భవిష్యత్ తరాలు లాభపడతాయని చెప్పారు. చక్కెర సీజన్ లేనప్పుడు మల్టీ-ఫీడ్ ఇథనాల్ యూనిట్లు పెట్టాలన్నారు. రాష్ట్రంలో పర్యటిస్టున్న అమిత్​షా వర్షాలు, వరద నష్టాలపై సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు షిండే, అజిత్ పవార్‌‌‌‌‌‌‌‌తో సమావేశమయ్యారు.`