
న్యూఢిల్లీ: అక్టోబర్‌తో మొదలయ్యే నెక్స్ట్ సీజన్లో చక్కెర ప్రొడక్షన్కొంచెం తగ్గనుందని అంచనా వేస్తున్నారు. 2021–22 సీజన్లో ఈ ప్రొడక్షన్ 30.5 మిలియన్ టన్నులుగా ఉంటుందని, ఇథనాల్ తయారీ కోసం చెరకును డైవర్ట్ చేయడమే దీనికి కారణమని సీనియర్ గవర్నమెంట్ ఆఫీసర్ వెల్లడించారు. సెప్టెంబర్‌తో ముగిసే ప్రస్తుత సీజన్లో పంచదార ఉత్పత్తి 31 మిలియన్ టన్నుల దాకా ఉండొచ్చని అంచనా. చక్కెర ప్రొడక్షన్లో బ్రెజిల్ తర్వాత రెండో ప్లేస్ మనదే. చెరకు పంట ఈ ఏడాది బాగానే ఉందని, కాకపోతే ఇథనాల్ తయారీకి చెరకును మళ్లించడం వల్లే చక్కెర ప్రొడక్షన్ తగ్గుతుందని అంచనా వేస్తున్నామని ఫుడ్ మినిస్ట్రీలో జాయింట్ సెక్రటరీ సుబోధ్ కుమార్ సింగ్ చెప్పారు. ప్రస్తుత సీజన్లో కూడా చక్కెర ప్రొడక్షన్ కోసం ఉద్దేశించిన 2 మిలియన్ టన్నుల చెరకును ఇథనాల్ కోసం మళ్లించినట్లు తెలిపారు. 2021–22 సీజన్లో ఇది మరింత పెరిగి 3.5 మిలియన్టన్నులకు చేరుతుందని పేర్కొన్నారు.