
సదాశివనగర్, వెలుగు: చెరుకు రైతులకు రూ.లక్ష సబ్సిడీపై డ్రోన్లు అందిస్తున్నామని, తెలంగాణతోపాటు మహారాష్ర్ట, కేరాళ, ఛత్తీస్గడ్ రాష్ర్టాల రైతులకు భారత ప్రభుత్వ (డీజీసీఏ) ద్వారా ఆమోదించి డ్రోన్లు గాయత్రీ షుగర్స్యాజమాన్యం ఆధ్వర్యంలో తయారు చేస్తుందని ప్రెసిడెంట్ శంకర్రావు, వైస్ప్రెసిడెంట్వేణుగోపాల్రావు అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూర్, ఎల్లారెడ్డి గాయత్రీ షుగర్స్ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రైతుల వ్యవసాయ పంటల వద్ద డ్రోన్ ద్వారా పురుగు మందుల పిచికారీ విధానాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకే గాయత్రీ యాజమాన్యం సీఈవో అనురుధ్‌రెడ్డి ఆధ్వర్యంలో డ్రోన్లు తయారు చేస్తున్నట్లు తెలిపారు. డ్రోన్ అవసరం ఉన్న రైతులకు బ్యాంక్ ద్వారా రుణాలు తీసుకుని కొనుగోలు చేయవచ్చాన్నారు. వ్యవసాయ పనుల్లో రైతులు డ్రోన్లు వాడి అధిక దిగుబడి పొందాలని సూచించారు. కార్యక్రమంలో డ్రోన్మార్కెటింగ్ అధికారి రాజేంద్రప్రసాద్, పైనాన్స్ మేనేజర్ మాల కొండయ్య, పీవో బస్వాపున్నరెడ్డి, మేనేజర్ కేన్ సిద్ధగౌడ్, బాల్‌రాజ్, దామోదర్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, ఏవోలు రమేశ్, లక్ష్మారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.