కేసుల పరిష్కారానికి టెక్నాలజీ ఉపయోగించాలి: సీపీ. ఎన్. శ్వేత

కేసుల పరిష్కారానికి టెక్నాలజీ ఉపయోగించాలి: సీపీ. ఎన్. శ్వేత

సిద్దిపేట రూరల్, వెలుగు: టెక్నాలజీని ఉపయోగించి పెండింగ్ కేసులను పరిష్కరించాలని సీపీ. ఎన్. శ్వేత అన్నారు. బుధవారం సీపీ ఆఫీస్​లో గజ్వేల్, సిద్దిపేట డివిజన్ పోలీసులతో  సమీక్ష నిర్వహించారు. కేసుల్లో శిక్షల శాతం పెంచాలని, ప్రతినెలా 20 లోపు కేసుల ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు. పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసుల్లో 60 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ అందె శ్రీనివాసరావు, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ఎస్​ .మల్లారెడ్డి, ఏసీపీ రమేశ్, సురేందర్ రెడ్డి, చంద్రశేఖర్, సీఐలు జాన్ రెడ్డి, జానకిరామ్ రెడ్డి, కమలాకర్, తిరుపతి, గురుస్వామి, రఘుపతి రెడ్డి, రంగాకృష్ణ, కృష్ణారెడ్డి, రవికుమార్, భాను ప్రకాశ్, చేరాలు, కృష్ణ పాల్గొన్నారు.

టెట్ సెంటర్ల వద్ద 144 సెక్షన్..

ఈనెల 15 న  టెట్​  జరిగే  36 కేంద్రాల వద్ద  144 సెక్షన్​ అమలు చేస్తున్నట్లు సీపీ. ఎన్. శ్వేత తెలిపారు. పరీక్ష సెంటర్స్ నుంచి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దని సూచించారు. అలాగే కమిషనరేట్ పరిధిలో ఈనెల 14 నుంచి 21 వరకు సిటీ పోలీస్ యాక్టు అమలు చేస్తున్నట్టు సీపీ శ్వేత తెలిపారు. అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు పెట్టొద్దని పేర్కొన్నారు.