సుగుణ సుందరి సాంగ్..బాలయ్య–శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు

సుగుణ సుందరి సాంగ్..బాలయ్య–శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు

నందమూరి నట సింహం బాలకృష్ట హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. మైత్రీ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి మాస్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'సుగుణ సుందరి.. సుర సుర సూపుల రాకుమారి' అనే లిరికల్ సాంగ్ ను వదిలారు.

'సీమా కుట్టిందే.. సిట్టి సీమా కుట్టిందే.. దిల్లు కందిపోయేలాగా దిట్టంగా కుట్టిందే' అంటూ, బాలయ్య–శ్రుతి హాసన్ పై చిత్రీకరించిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. తమన్ ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించాడు. రామ్ మిర్యాల.. స్నిగ్ధ శర్మ ఈ పాటను ఆలపించారు.