వరల్డ్ పవర్ లిఫ్టింగ్‌‌‌‌ చాంపియన్‌షిప్‌కు సుకన్య

వరల్డ్ పవర్ లిఫ్టింగ్‌‌‌‌ చాంపియన్‌షిప్‌కు సుకన్య

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రానికి చెందిన పవర్ లిఫ్టర్ తెజావత్ సుకన్య బాయి వరల్డ్  పవర్ లిఫ్టింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌కు సెలెక్ట్ అయింది. అమెరికాలోని టెక్సాస్‌‌‌‌లో మే 17 నుంచి జూన్ 21 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో 76 కేజీ వెయిట్ కేటగిరీలో పోటీ పడనుంది. గురువారం హైదరాబాద్‌‌‌‌లో జరిగిన సంత్‌‌‌‌ సేవాలాల్ జయంతి సందర్భంగా సుకన్యను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు.

దీనిపై సుకన్య ఆనందం వ్యక్తం చేసింది.  ఇటీవల జరిగిన సీనియర్ నేషనల్ బెంచ్ ప్రెస్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో బ్రాంజ్ మెడల్‌‌‌‌ నెగ్గిన సుకన్య  తన కోచ్ రాజశేఖర్ సపోర్ట్‌‌‌‌తో ఆటలో మరింత ముందుకెళ్తానని చెప్పింది.