ఎంటర్టైన్ చేయడం కోసమే పుట్టా.. రూమర్స్పై సుమ క్లారిటీ

ఎంటర్టైన్ చేయడం కోసమే పుట్టా.. రూమర్స్పై సుమ  క్లారిటీ

తెలుగు ఇండస్ట్రీలో టాప్ యాంకర్ ఎవరు?  అనే ప్రశ్నకు అందరికి టక్కున గుర్తొచ్చే పేరు సుమ కనకాల. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా, టాక్ షో అయినా తన కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే, తాజాగా ఓ షో ప్రోమోలో ‘యాంకరింగ్ నుంచి కొన్ని రోజులు విరామం తీసుకుంటున్నా. ఇంతకాలం నన్ను ఆదరించినందుకు చాలా థాంక్స్’ అంటూ కన్నీళ్లు పెట్టుకుని చెప్పింది. ఆ వీడియో వైరల్ అయ్యేసరికి సుమ నిజంగానే యాంకరింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటుందేమోనని అంతా అనుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో పర్సనల్ మెసేజ్ లు చేసి ఏం జరిగిందని ఆరా తీస్తున్నారట. దీనిపై స్పందించిన సుమ వాస్తవాలు వివరిస్తూ ఒక వీడియో పోస్ట్ చేసింది. 

‘నేను రీసెంట్గా ఒక న్యూఇయర్ ఈవెంట్ కు యాంకరింగ్ చేశా. అందులో కాస్త ఎమోషనల్ అయిన మాట వాస్తవమే. కానీ, అది ఇండస్ట్రీని వీడుతున్నట్లు కాదు. ఈ విషయంపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రోమో చూసి అంచనాకు రావద్దు. ఈ ఈవెంట్ మొత్తం చూస్తే మీకు అసలు విషయం తెలుస్తుంది. నేను టీవీ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం పుట్టా. ఇండస్ట్రీ విడిచి ఎక్కడికీ వెళ్లను. మీ వల్ల హ్యాపీగా ఉన్నా. హ్యాపీగా ఉండండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్' అంటూ విషెస్ చెప్పింది. అది చూసిన సుమ ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు.