
ఒకప్పుడు కూల్ సబ్జెక్ట్స్ ఎంచుకున్న సుమంత్.. ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకుంటున్నాడు. ముఖ్యంగా థ్రిల్లర్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అట్లూరి ప్రశాంత్ సాగర్ డైరెక్షన్‌లో చేస్తున్న ‘అహం రీబూట్’ కూడా థ్రిల్లర్ మూవీనే. రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. జులైలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రీసెంట్‌గా టీజర్‌ను అడివి శేష్ లాంచ్ చేశాడు. ‘మీ ఆలోచనలు కూడా ప్రసారమవుతాయి’ అనే రేడియో సృష్టికర్త మార్కొని కొటేషన్‌తో వీడియో మొదలైంది. తనని కొంతమంది కిడ్నాప్ చేశారు కాపాడమంటూ ఒకమ్మాయి ఆర్జేగా వర్క్ చేస్తున్న సుమంత్‌కి కాల్ చేస్తుంది. తనలాగే చాలామంది అమ్మాయిలు కాల్ చేస్తుంటారు. వాళ్లందర్నీ ఎవరు కిడ్నాప్ చేశారు, సుమంత్ ఎలా కాపాడాడనేది కథ. ఒక యునిక్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తీస్తున్నామని, కచ్చితంగా అందరికీ నచ్చుతుందని టీమ్ చెబుతోంది.