
ఇండియా బాక్సర్లు సుమిత్ కుండు, నీరజ్ ఫొగాట్.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బోణీ చేశారు. శుక్రవారం జరిగిన మెన్స్ 75 కేజీ తొలి రౌండ్‌లో సుమిత్ 5–0తో మహ్మద్ అల్ హుస్సేన్ (జోర్డాన్)పై ఏకగ్రీవంగా గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరాడు. బౌట్ స్టార్టింగ్‌లోనే బలమైన పంచ్‌లతో అల్ హుస్సేన్‌ను డిఫెన్స్‌లోకి నెట్టాడు. తర్వాత నియంత్రణతో కూడిన పంచ్‌లు విసిరి వరుసగా పాయింట్లు గెలిచాడు.
ఖచ్చితమైన బ్యాక్ హ్యాండ్ పంచ్‌లతో జోర్డాన్ బాక్సర్‌ను అడ్డుకున్నాడు. రెండో రౌండ్ ముగిసేసరికి సుమిత్ స్పష్టమైన ఆధిక్యంలో నిలిచాడు. చివరి రౌండ్‌లో కాస్త వెనక్కి తగ్గినా హుస్సేన్‌కు మాత్రం పుంజుకునే చాన్స్ ఇవ్వలేదు. ప్రిక్వార్టర్స్‌లో సుమిత్.. యూరోపియన్ చాంపియన్ రామి కివాన్ (బల్గేరియా)తో తలపడతాడు. విమెన్స్ 65 కేజీ తొలి రౌండ్‌లో నీరజ్ ఫొగాట్ 3–2తో క్రిస్టా కోవలైనెన్ (ఫిన్లాండ్)పై నెగ్గింది. 70 కేజీల్లో సనామాచా చాను 4–1తో డిట్టే ఫ్రాస్టోల్మ్‌పై గెలిచింది. మెన్స్ 90 కేజీల్లో హర్ష్ చౌదరీ ఆర్‌ఎస్‌సీ ద్వారా టుటక్ ఆడమ్ (పోలెండ్) చేతిలో ఓడాడు.