మట్టికుండలే మంచివి

మట్టికుండలే మంచివి

లాక్డౌన్ లో పడి చాలా మందికి అర్థం కావట్లేదు. కానీ, సమ్మర్ తనపని తాను చేసుకుంటూ పోతోంది. మట్టికుండలు దాహాన్ని తీర్చడమే కాకుండా బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇస్తాయి. సాధారణంగా సమ్మర్లో చాలామందికి, చల్లటి నీళ్లు తాగాలనిపిస్తుంది. ఫ్రిజ్ లో పెట్టిన నీళ్లు తాగితే… జలుబు, దగ్గు, గొంతు నొప్పి బారిన పడాల్సి వస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే సొల్యూషన్ ‘మట్టికుండ’.

బ్యాలెన్స్ చేస్తాయి

సమ్మర్లో చాలా మందిని భయపెట్టేది, ఎక్కువ మందికి కామన్ గా ఇబ్బంది కలిగించేది…సన్ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి మట్టికుండలు బాగా పని చేస్తాయి. బంకమట్టి కుండల్లో నీళ్లు పోయడం వల్ల… ఆ నీటికి సహజంగా విటమిన్స్, మినరల్స్ యాడ్ అవుతాయి. అవి మన బాడీలో గ్లూకోజ్ స్థాయిని బ్యాలెన్స్ చేసేందుకు సాయపడతాయి. శరీరాన్ని కూడా కూల్ గా ఉంచుతాయి.

మెటబాలిజానికి బూస్ట్

రిఫ్రిజిరేటర్లలో, ప్లాస్టిక్ బాటిళ్లలో స్టోర్ చేసిన నీళ్లలో బిస్ఫినాల్ ఎ, బిపిఎ వంటి హానికారక రసాయనాలు ఉంటాయి. ఇవి అనేకరకాలుగా మన శరీరంపై దాడి చేస్తాయి. శరీరంలోని టెస్టో స్టెరాన్ లెవెల్స్ తగ్గిస్తుంది. దీన్నే ఎండో క్రైన్ డిస్ట్రప్టర్ అని కూడా అంటారు. అదే, మట్టికుండల్లో నీళ్లు… టెస్టోస్టెరాన్ లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తాయి. మెటబాలిజాన్ని కూడా మెరుగుపరుస్తాయి.

ఆ సమస్య ఉండదు

సాధారణంగా కూల్ వాటర్ తాగినప్పుడు, కడుపులో ఆమ్లాలు ఏర్పడతాయి. అది ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కి దారితీస్తుంది. డైజెస్టివ్ సిస్టం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. పళ్ళు కూడా నొప్పులు పెడతాయి. కుండనీళ్ల‌తో ఈ సమస్యలేవీ ఉండవు. పైగా కలిసొచ్చే, లాభాలు కూడా ఉంటాయి. శరీరంలో పీహెచ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి.