రేపటి నుంచి స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్

రేపటి నుంచి స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్
  •  ఇయ్యాల పేరెంట్స్ మీటింగ్, జూన్12న స్కూల్స్​ రీఓపెన్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు బుధవారం నుంచి సమ్మర్ హాలిడేస్ ప్రారంభం కానున్నాయి. ఈ నెల24 నుంచి జూన్11 వరకు అన్ని రకాల మేనేజ్​మెంట్ల పరిధిలోని బడులకు సెలవులు ఇవ్వనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరంలో చివరి వర్కింగ్ డే  అయిన మంగళవారం సమ్మెటీవ్ అసెస్ మెంట్–2 పరీక్షల ఫలితాలను టీచర్లు స్కూళ్లలో ప్రకటిస్తారు.

అనంతరం పేరెంట్స్, టీచర్స్ సమావేశం నిర్వహించి స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డులను అందిస్తారు. విద్యార్థుల మార్కులపై వారికి వివరిస్తారు. వచ్చే విద్యాసంవత్సరం కూడా సర్కారు బడుల్లోనే పిల్లలను కొనసాగించేలా వారిని మోటివేట్ చేయనున్నారు. అయితే, సమ్మర్ హాలీడేస్​లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారు లు ఇప్పటికే ప్రకటించారు. తిరిగి జూన్ 12న బడులు తెరుచుకోనున్నాయి.