సమ్మర్ స్పెషల్: ఐస్‌క్రీమ్ పార్లర్ స్టైల్ లో 'కోకోనట్ మిల్క్‌షేక్' .. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..

సమ్మర్ స్పెషల్: ఐస్‌క్రీమ్ పార్లర్ స్టైల్ లో 'కోకోనట్ మిల్క్‌షేక్' .. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..

వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరిచే గుణం కొబ్బరి నీళ్లకు, కొబ్బరి పాలకు ఉంది.  సాధారణంగా మనం కొబ్బరి నీళ్లు తాగుతాం లేదా కొబ్బరితో స్వీట్స్ చేసుకుంటాం. కానీ, పచ్చి కొబ్బరి పాలు, డ్రై ఫ్రూట్స్‌తో కలిపి ఇలా చిక్కటి మిల్క్‌షేక్ చేస్తే... ఆ రుచి అమోఘం! ఎప్పుడూ తాగే రెగ్యులర్ జ్యూస్‌లు కాకుండా, వెనిలా ఐస్‌క్రీమ్, బాదాం, జీడిపప్పుల కాంబినేషన్‌తో నోట్లో వెన్నలా కరిగిపోయేలా ఉండే ఈ కోకోనట్ మిల్క్‌షేక్ రెసిపీ మీకోసం. ఇంట్లోనే ఎంతో హైజీనిక్‌గా, రెస్టారెంట్ స్టైల్‌లో ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్‌ని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం...

కావాల్సినవి:
కొబ్బరి ముక్కలు - రెండు కప్పులు
కొబ్బరి నీళ్లు - 450 మిల్లీ గ్రాములు 
యాలకులు - 4, 
జీడిపప్పు - 15 
బాదాం - 15, 
లేత కొబ్బరి - ఒక టీ స్పూన్ 
చక్కెర- మూడు టేబుల్ స్పూన్లు
వెనిలా ఐస్క్రీం - రెండు స్కూప్లు

తయారీ విధానం:
పచ్చి కొబ్బరి ముక్కలు, 250 మిల్లీ గ్రాముల కొబ్బరి నీళ్లు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులో యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని క్లాత్లోకి తీసి గట్టిగా పిండి వడగట్టి పాలు వేరు చేయాలి. మిగిలిన పిప్పిని మళ్లీ మిక్సీ జార్లో వేసి, 150 గ్రాముల కొబ్బరి నీళ్లు పోసి గ్రైండ్ చేయాలి. క్లాత్ లో తీసి పాలు వేరుచేయాలి. ఆ పాలని గంటసేపు ఫ్రిజ్లో పెట్టాలి. పావుకప్పు కొబ్బరి పాలు, గంటసేపు నానబెట్టిన జీడిపప్పు, గంటకు పైగా నానబెట్టి పొట్టు తీసిన బాదాం, చక్కెర, లేత కొబ్బరి మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ లో ఫ్రిజ్లో పెట్టిన కొబ్బరి పాలు, బాదాం పేస్ట్, వెనిలా ఐస్క్రీం వేసి ఇరవై సెకన్లు మిక్సీ పట్టాలి. అంతే కోకోనట్ మిల్క్ షేక్ రెడీ.