Summer tour: గ్యాడ్జెట్స్​..పోర్టబుల్​ ఫ్యాన్​.. ప్రయాణంలో ఉక్కపోత నుంచి రిలీఫ్​

Summer tour: గ్యాడ్జెట్స్​..పోర్టబుల్​ ఫ్యాన్​.. ప్రయాణంలో ఉక్కపోత నుంచి రిలీఫ్​

సమ్మర్​లో చాలామంది టూర్లకు వెళ్తుంటారు. అలాంటివాళ్లు ఎంఏకే అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ పోర్టబుల్​ ఫేస్​ ఫ్యాన్​ని వెంట తీసుకెళ్తే ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుంది. ఇది చూడడానికి చిన్న హెయిర్​ డ్రయ్యర్​లా ఉంటుంది. కానీ.. ఇందులోని పవర్ ఫుల్​ బ్రష్‌‌‌‌లెస్ మోటార్ వల్ల చల్లని గాలి వస్తుంది. మోటార్​ 10,000 ఆర్​పీఎం స్పీడ్​తో తిరుగుతుంది. బరువు కూడా తక్కువే కాబట్టి ఈజీగా చేతిలో పట్టుకోవచ్చు. దీనికి కాన్సంట్రేటర్ నాజిల్ ఉంటుంది. 4,000mAh బ్యాటరీతో వస్తుంది.

 ఒకసారి ఫుల్​ చార్జ్​ చేస్తే 3–5 గంటలు వాడుకోవచ్చు. 2 గంటల్లో ఫుల్​ చార్జ్ అవుతుంది. ఫ్యాన్ స్పీడ్​, పవర్ లెవల్‌‌‌‌ను చూపించేందుకు దీనికి చిన్న డిస్​ప్లే కూడా ఉంటుంది. సమ్మర్​ ట్రావెలింగ్, క్యాంపింగ్, హైకింగ్, ఆఫీస్, అవుట్‌‌‌‌డోర్, ఇండోర్​లో వాడేందుకు అనుకూలంగా ఉంటుంది. ఫ్యాన్​కి మరోవైపు ఎల్​ఈడీ లైట్​ కూడా ఉంటుంది. ఇది ఇంట్లో కరెంట్​ లేని అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. 

నానో పవర్​బ్యాంక్​

కొన్నిసార్లు బయటికి వెళ్లినప్పుడు చార్జింగ్ ఎంత ఉందో చూసుకోకుండా  ఫోన్​ వాడుతూనే ఉంటాం. ఒక్కోసారి ఫోన్​ ఆఫ్ అయ్యేవరకు పట్టించుకోం. అలాంటి పరిస్థితుల్లో అర్జెంట్​గా ఎవరికైనా కాల్​ చేయాలంటే పరిస్థితి ఏంటి? అలాంటప్పుడు పోర్టోనిక్స్​ కంపెనీ తీసుకొచ్చిన ఈ నానో పవర్​బ్యాంక్​ బాగా ఉపయోగపడుతుంది. చూడడానికి చాలా చిన్నగా ఉన్నా ఇందులో 5000 mAh పవర్​ఫుల్​ బ్యాటరీ ఉంటుంది. ఇన్‌‌‌‌పుట్, అవుట్‌‌‌‌పుట్.. రెండింటికీ టైప్ సి పోర్ట్‌‌‌‌లు ఉంటాయి. చిన్నగా ఉండడం వల్ల పాకెట్​లో వేసుకుని వెళ్లిపోవచ్చు. బ్యాటరీ లెవల్​ని చూపించేందుకు ఇందులో ఇన్​బిల్ట్‌‌‌‌ ఎల్​ఈడీ ఇండికేటర్​ కూడా ఉంటుంది. పైగా ఈ పవర్‌‌‌‌బ్యాంక్ చాలా తేలికగా ఉంటుంది. ఫోల్డబుల్ టైప్ సి పిన్ ఉండడం వల్ల డ్యామేజ్​ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. 

అలారం కీచైన్​ 

ఆడవాళ్లు, పెద్దవాళ్ల దగ్గర ఒంటరిగా వెళ్లేటప్పుడు ఈ గాడ్జెట్​ ఉంటే ప్రమాదాల నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. దీన్ని బిరుడ్​ అనే కంపెనీ మార్కెట్లో అమ్ముతోంది. ప్రమాదం జరిగినప్పుడు లేదా ఏదైనా అనుకోని సంఘటన ఎదురైనప్పుడు ఈ గాడ్జెట్​కి ఉండే సేఫ్టీ పిన్​ని తీసేస్తే.. 130db సౌండ్​తో ఎమర్జెన్సీ అలారం మోగుతుంది. దానివల్ల చాలా తక్కువ టైంలోనే సాయమందే అవకాశం ఉంటుంది. మళ్లీ సేఫ్టీ పిన్‌‌‌‌ పెట్టేవరకు అలారం మోగుతూనే ఉంటుంది. ఇది పోర్టబుల్​ సైజులో ఉంటుంది. కీచైన్​లా కూడా వాడుకోవచ్చు. 

►ALSO READ | ఒత్తిడి పెరిగే కొద్ది సమస్యలు.. హైపర్ టెన్షన్ అవ్వొద్దు!

అంతేకాదు.. చీకటిగా ఉన్నప్పుడు ప్రమాదం జరిగిన చోటుని గుర్తించేందుకు దీనికి హై బ్రైట్‌‌‌‌నెస్ ఎల్​ఈడీ ఫ్లాష్‌‌‌‌లైట్ కూడా ఉంటుంది. బటన్​ నొక్కితే సైరన్ అలారంతో పాటు లైట్ కూడా వెలుగుతుంది. ఈ గాడ్జెట్​ని యూఎస్​బీతో రీచార్జ్ చేసుకోవచ్చు. ఇందులో 150mAh బ్యాటరీ ఉంటుంది. గంట చార్జింగ్ పెడితే 90 నిమిషాలు ఫ్లాష్​లైట్​, అలారం పనిచేస్తాయి.