ఆ రెండూ సుకుమార్​ వల్లే జరిగాయి

 ఆ రెండూ సుకుమార్​ వల్లే జరిగాయి

‘విరూపాక్ష’ సినిమాతో సంయుక్త మీనన్​ పేరు ట్రెండింగ్​గా మారింది. కార్తిక్​ దండు దర్శకత్వంలో సాయ్​ ధరమ్ తేజ్​ నటించిన ఈ సినిమా బ్లాక్​బస్టర్​ హిట్టందుకున్న విషయం తెలిసిందే. సంయుక్త లేని ఈ మిస్టరీ థ్రిల్లర్​ను ప్రేక్షకులు ఊహించుకోలేరు. అంతలా తన రోల్​కు ఇంపార్టెన్స్​ దక్కింది. తాజాగా ఈ సినిమా దర్శకుడు ఓ ఇంట్రెస్టింగ్​ విషయాన్ని చెప్పి షాకిచ్చాడు. 

ఇందులో అసలు విలన్​గా యాంకర్​ శ్యామల రోల్​ను చూపించాలనుకున్నారట. అయితే, ఈ సినిమాకు స్క్రీన్​ ప్లే అందించిన తన గురువు సుకుమార్​ సూచన మేరకు అందులో మార్పులు చేశాడట. దీంతో హీరోయిన్​నే అసలు విలన్​గా చూపిస్తూ కథను మార్చుకున్నారట. సినిమాకు ఈ సస్పెన్స్​ ఎంత పెద్ద ప్లస్​గా మారిందో తెలిసిందే. సుకుమార్​ ఈ చేంజ్​ చేసుండకపోతే ఈ ముద్దగుమ్మకు ఇంత క్రేజ్​ వచ్చేది కాదేమో.