
న్యూఢిల్లీ: తయారీ సమస్యల కారణంగా సన్ ఫార్మా, లుపిన్లు అమెరికా మార్కెట్లో ఉత్పత్తులను వెనక్కి రప్పిస్తున్నాయని (రీకాల్) యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) తెలిపింది. ముంబైకి చెందిన సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ యూఎస్‌లో 96,192 బాటిళ్ల లియోథైరోనిన్ సోడియం టాబ్లెట్లను రీకాల్ చేస్తోంది. ఈ మందును థైరాయిడ్‌కు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.
ప్రిన్స్‌టన్‌కు చెందిన సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ దాద్రా ఫెసిలిటీలో ఉత్పత్తి చేసిన మందులను రీకాల్ చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 4న కంపెనీ స్వచ్ఛందంగా క్లాస్ 2 రీకాల్‌ను ప్రారంభించింది. ముంబైకి చెందిన లుపిన్ కూడా యూఎస్‌లో పెన్సిలామైన్ టాబ్లెట్‌లను రీకాల్ చేస్తోందని యూఎస్‌ఎఫ్‌డీఏ పేర్కొంది. ఎన్ని ట్యాబ్లెట్లను రీకాల్ చేస్తుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.