SRH vs PK : ఖాతా ఓపెన్.. ఎట్టకేలకు సన్ రైజర్స్ గెలిచింది

SRH vs PK : ఖాతా ఓపెన్.. ఎట్టకేలకు సన్ రైజర్స్ గెలిచింది

సన్ రైజర్స్ హైదరాబాద్ ఆట మొదలుపెట్టింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయిన రైజర్స్.. హోం గ్రౌండ్ లో సత్తా చాటింది. పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించి టోర్నీలో మొదటి విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్.. పంజాబ్ ను 143 పరుగులకు కట్టడిచేసింది. ఎనిమిది వికెట్ల తేడాతో పంజాబ్ పై అద్భుత విజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్ల దాటికి పంజాబ్ బ్యాట్స్ మెన్ నిలవలేకపోయారు. మయాంక్ మర్కందే 4 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ కెప్టెన్ ధవన్ ఒక్కడే నిలబడి 99 పరుగులు చేసి అజేయంగా నలిచాడు.

144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్.. కేవలం 17.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. హైదరాబాద్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి (74, 48 బంతుల్లో) సూపర్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. కెప్టెన్ మార్క్రమ్ (37, 21 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్లు హారీ బ్రూక్స్ (13, 14 బంతుల్లో), మయాంక్ అగర్వాల్ (21, 20 బంతుల్లో ) రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, రాహుల్ చాహర్ చెరో వికెట్ పడగొట్టారు.