దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చి సన్ ఫ్లవర్ రైతుల నిరసన.. కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్

దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చి సన్ ఫ్లవర్ రైతుల నిరసన.. కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్

తొగుట, వెలుగు: పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ మంగళవారం రైతులు రోడ్డెక్కారు. తొగుట మార్కెట్ యార్డుకు సన్​ఫ్లవర్​ పంట తీసుకొచ్చి 40 రోజులు గడిచినా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దున్నపోతును వెంటబెట్టుకుని మార్కెట్ యార్డు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 

దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్​ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. తహసీల్దార్‌‌‌‌కు కు వినతిపత్రం అందజేశారు. వీరికి సొసైటీ చైర్మన్ కె.హరికృష్ణా రెడ్డి, బీఆర్‌‌‌‌ఎస్ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి తదితరులు సంఘీభావం తెలిపారు.