ఒక్క కోహ్లీ విషయంలోనే ఎందుకిలా?

ఒక్క కోహ్లీ విషయంలోనే ఎందుకిలా?

టీంఇండియాలో ఇప్పుడు డిస్కషన్ మొత్తం కోహ్లీ గురించే.  సెంచరీ చేసి రెండేళ్లు అవుతుండండం, పేలవమైన ఫామ్ ను కొనసాగిస్తుండడంతో  కోహ్లీ పైన మాజీ క్రికెటర్లు ఫోకస్ చేస్తున్నారు.  కోహ్లీని సెలక్టర్లు  పక్కన పెట్టాలంటూ ఇటీవల మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ తీవ్ర విమర్శలు చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ అండగా నిలబడ్డాడు సునీల్ గవాస్కర్.  కోహ్లీకి మద్దతుగా మాట్లాడుతునే..  తెరపైకి  రోహిత్‌ శర్మని తీసుకువచ్చాడు గవాస్కర్.  ‘రోహిత్ శర్మ పరుగులు చేయనప్పుడు ఎవరూ దాని గురించి మాట్లాడలేదు. మరే ఇతర ఆటగాడు ఫామ్‌లో లేనప్పుడు ఎవరూ ప్రశ్నించలేదు. ఒక్క కోహ్లీ విషయంలోనే ఎందుకిలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు’అంటూ  గావస్కర్‌  కామెంట్స్ చేశాడు.

ఫామ్ తాత్కాలికం..క్వాలిటీ పర్మినెంట్ అని అన్నాడు గావస్కర్‌ ." కొన్నిసార్లు బాగా ఆడాలన్న ప్రయత్నంలో బ్యాటర్లు విఫలం అవుతారు. అందుకు ఒక ఆటగాడిని లక్ష్యంగా చేసుకొని కామెంట్స్ చేయడం సరికాదు. ఇంగ్లాండ్‌పై దూకుడుగా ఆడాలని కోహ్లీ అనుకున్నాడు. కానీ త్వరగా ఔటయ్యాడు. టీ20 ప్రపంచకప్‌కు ఇంకా టైమ్  చాలా ఉంది. జట్టును ఎంపిక చేయకడానికి సెలెక్షన్‌ కమిటీ బాధ్యత వహిస్తుంది. ఈ విషయం గురించి వారే ఆలోచిస్తారు " అని గవాస్కర్ అన్నాడు