కోహ్లీ,రోహిత్కు గవాస్కర్ హెచ్చరిక

కోహ్లీ,రోహిత్కు గవాస్కర్ హెచ్చరిక

షాట్ల ఎంపిక విషయంలో కోహ్లీ, రోహిత్ శర్మ మరింత జాగ్రత్తగా ఉండాలని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. కోహ్లీ తనకు దక్కిన లైఫ్ లైన్స్‌ను ఉపయోగించుకుని మరింత బాగా ఆడాల్సిందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆసియా కప్ 2022లో పాక్ తో జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ వికెట్‌ను భారత్ ఆదిలోనే కోల్పోయింది. అయితే రెండో వికెట్‌కు రోహిత్, విరాట్‌ల 49పరుగుల పాట్నర్ షిప్ను నెలకొల్పారు. వీరిద్దరు భారీ షాట్లకు యత్నించి లెఫ్ట్ ఆర్మర్ మహ్మద్ నవాజ్ చేతిలో ఒకే రీతిలో లాంగాఫ్లో  క్యాచ్ ఔటయ్యారు. 

ఇద్దరూ క్షమించరాని షాట్లతో ఔటయ్యారు..
పాక్ మ్యాచ్‌లో కోహ్లీకి అదృష్టం కలిసి వచ్చింది. కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ డ్రాప్ అయ్యింది. చాలా ఇన్‌సైడ్ ఎడ్జ్‌లు అయ్యి వికెట్లకు తాకకుండా మిస్సయ్యాయి. కొంతవరకు సద్వినియోగం చేసుకుని.. చూడచక్కని షాట్‌లు ఆడాడు.  అయితే కోహ్లీ 60 లేదా 70పరుగులు చేస్తాడని అనుకున్న. కెప్టెన్ రోహిత్ అవుటైన వెంటనే  కోహ్లీ కూడా ఔటయ్యాడు. అయితే ఇద్దరూ క్షమించరాని షాట్లతో ఔటయ్యారు. వారున్న స్థితిలో  సిక్సర్లు కొట్టాల్సిన పరిస్థితి లేదు. రిక్వైర్డ్ రన్ రేట్ 19 లేదా 20 ఏం లేదు. జస్ట్ 8గా మాత్రమే ఉంది. కాబట్టి అలాంటి రిస్కీ షాట్లు అవసరం లేదు. స్కోరు 70- -80కి చేరుకున్న  తర్వాత అలాంటి పెద్ద షాట్లు ఆడాలి. అంతేగానీ కీలక సమయంలో అనవసరమైన షాట్లు ఆడి వికెట్ అప్పగించారు.  కోహ్లీ, రోహిత్లు పాక్ గేమ్ నుంచి ఇదే నేర్చుకోవాలి. అని సునీల్ గవాస్కర్ అన్నాడు. 

ఆసియా కప్ 2022లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్లో 148 పరుగులను ఛేజ్ చేసే క్రమంలో కోహ్లీ, రోహిత్ ఒకే తరహా షాట్ ఆడి ఔటయ్యారు. భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి లెఫ్ట్ ఆర్మర్ మహ్మద్ నవాజ్ బౌలింగ్లో పెవీలియన్ చేరారు. రోహిత్ 50, కోహ్లీ 53 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. దీంతో 7.5ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 50పరుగులు చేయగా.. ఎనిమిది బంతుల వ్యవధిలో భారత స్కోరు 3 వికెట్ల నష్టానికి 53పరుగులకు చేరుకుని తీవ్ర కష్టాల్లో పడింది. ఆ తర్వాత  హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వీరోచితంగా పోరాడి భారత్‌ను ఐదు వికెట్ల తేడాతో గెలిపించారు.