మాజీల జోస్యం..టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు చేరేది ఈ రెండు జట్లే..

మాజీల జోస్యం..టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు చేరేది ఈ రెండు జట్లే..

టీ20 వరల్డ్ కప్ మొదలైంది. అక్టోబర్ 16 నుంచి క్వాలిఫయర్స్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చిన్న జట్లు నమీబియా, స్కాట్లాండ్ ...పెద్దజట్లుగా పేరొందిన శ్రీలంక, విండీస్లకు షాకిచ్చాయి. అద్భుతమైన పోరాటంతో..రెండు జట్లు విజయం సాధించాయి.  ఇక ఈ నెల 22 నుంచి సూపర్ 12 దశ మొదలవనుంది. తొలి మ్యాచ్లో ఆతిధ్య ఆస్ట్రేలియా..న్యూజిలాండ్ తో ఆడనుంది. ఇక టీమిండియా తన తొలి మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి పాక్తో తలపడనుంది. అక్టోబర్ 23న మెల్ బోర్న్లో ఈ మెగా మ్యాచ్ జరగబోతుంది.ఇప్పటికే వార్మప్ గేమ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించడంతో రోహిత్ శర్మ పాక్తో జరిగే మ్యాచ్లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరే జట్లేవో తేల్చేశారు మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, టామ్ మూడీ.  

ఫైనల్కు చేరేది ఆ రెండు జట్లే..
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వెళ్లే జట్లను  టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అంచనా వేశాడు. పొట్టి ప్రపంచకప్ ఫైనల్లో ఇండియా, ఆస్ట్రేలియా తలపడతాయని గవాస్కర్ జోస్యం చెప్పాడు. ఖచ్చితంగా ఫైనల్లో ఇండియా ఆడబోతుందన్నాడు. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా కూడా ఫైనల్ చేరుతుందని నొక్కిచెప్పాడు. 

ఇండియా, ఆస్ట్రేలియాకే ఛాన్స్..
టామ్ మూడీ సైతం ఆస్ట్రేలియా, ఇండియా జట్లకే ఫైనల్ చేరే అవకాశాలున్నాయని తేల్చేశాడు.  రెండు గ్రూపుల నుంచి నాలుగు జట్లకు అవకాశం ఇచ్చిన టామ్ మూడీ...సెమీస్కు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు వారి గ్రూప్ నుండి వెళ్తాయని చెప్పాడు. అలాగే మరో గ్రూప్ నుంచి పాకిస్తాన్ ,భారత్ సెమీస్కు చేరుకుంటాయన్నాడు. ఈ సెమీ ఫైనల్స్లో ..ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా, పాక్పై టీమిండియా విజయం సాధించి..ఫైనల్ చేరుకుంటాయని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.