ఇలా అయితే కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోతుంది

ఇలా అయితే కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోతుంది

పంజాబ్ లో అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని ఎందుకు దూరమవుతున్నారన్న దానిపై ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు సునీల్ జాఖర్.. ఇటీవల కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరిన ఆయన మాట్లాడుతూ....దేశానికి విధేయత చూపడంలో కాంగ్రెస్ విఫలమైందని, దాని లోపాలను పరిష్కరించడంలో కూడా విఫలమైతే ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు.. పంజాబ్ కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రులు నలుగురు ఈ రోజు బీజేపీలో చేరిన అనంతరం ఆయన ఈ కాంమెట్స్ చేశారు.  పంజాబ్ మాజీ మంత్రులైన గురుప్రీత్ సింగ్ కంగ‌ర్‌, బ‌ల్బీర్ సింగ్ సంధూ, రాజ్ కుమార్ వెర్కా, సుంద‌ర్ శ్యామ్ అరోరా, మాజీ ఎమ్మెల్యే కేవ‌ల్ సింగ్ ధిల్లాన్ శ‌నివారం బీజేపీలో చేరారు. చండీగఢ్‌లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ చీఫ్ నడ్డా సమక్షంలో వీరంతా బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.

మరిన్ని వార్తల కోసం... 
 

మీ నాయకుడి అవినీతి బయటపెడ్తం