
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్(Sunny leone)కు టాలీవుడ్‌లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇంతకాలం వెండితెరపై అలరించిన ఆమె.. ఇప్పుడు తొలిసారిగా తెలుగు బుల్లితెరపై కనిపించబోతోంది. ప్రముఖ ఛానల్ కోసం తెలుగు మీడియం స్కూల్(Telugu medium ischool) అనే కొత్త రియాల్టీ షోలో గెస్టుగా పాల్గొననుంది. దీనికి సంబంధించిన ప్రోమోరిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టెలివిజన్ చరిత్రలో మునుపెన్నడూ చూడని రియాల్టీ షోగా తెలుగు మీడియం స్కూల్ ఉండనుందని సమాచారం. ఇక ఈ షోలో సన్నీలియోన్‌తో పాటు.. ప్రముఖ గాయకుడు మనో, యాంకర్ రవి కూడా ఉన్నారు. ఈ ప్రోమోకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సూపర్, అద్భుతం అంటూ సన్నీలియోన్‌పై కామెంట్స్ చేస్తున్నారు. ఈ షో కాన్సెప్ట్ ఏంటి? ఎప్పుటి నుంచి మొదలుకానుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. తెలుగు బుల్లి తెరపై.. మొదటిసారి ఓ షోకు గెస్టుగా వస్తున్న సన్నీలియోన్ ఏ మేరకు ఆడియన్స్ ను అలరిస్తుందో చూడాలి.