హైదరాబాద్: సొంతగడ్డపై కేకేఆర్‌తో జరుగుతోన్న మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ తడబడ్డారు. కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ మోస్తారు స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఓపెనర్ ట్రావిస్ హెడ్ (61) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. ఇషాన్ కిషన్ (42) రాణించారు. స్టార్ బ్యాటర్స్ క్లాసెన్ (11), అభిషేక్ శర్మ విఫలం కావడంతో సన్ రైజర్స్ భారీ స్కోర్ చేయలేకపోయింది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీయగా.. సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అరోరా, అంకుల్ రాయ్, గ్రీన్ తలో వికెట్ సాధించారు.
తడబడ్డ కాటేరమ్మ కొడుకులు:
ఈ మ్యాచులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యారు. తొలుత అదరగొట్టిన కాటేరమ్మ కొడుకులు ఆ తర్వాత వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ట్రావిస్ హెడ్ (61), ఇషాన్ కిషన్ (42) మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. అభిషేక్ శర్మ (15), క్లాసెన్ (11), అనికేత్ వర్మ (4), స్మరణ్ (2), కమిన్స్ (10), శివాంగ్ కుమార్ (2), హర్షల్ పటేల్ (6), ఎషాన్ మలింగా (2) వెనువెంటనే ఔటై పెవిలియన్ చేరారు.
హెడ్ దూకుడుతో పవర్ ప్లేలో భారీగా పరుగులు సమర్పించుకున్న కేకేఆర్ బౌలర్లు ఆ తర్వాత అనుహ్యంగా పుంజుకుని ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్‌ను కట్టడి చేశారు. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో సత్తాచాటాడు. సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అరోరా, అంకుల్ రాయ్, గ్రీన్ తలో వికెట్ సాధించారు.
