హిట్టర్ల పవర్ షో.. ఊగిపోయిన ఉప్పల్.. క్రికెట్ ఫ్యాన్స్ కు పసందైన విందు

హిట్టర్ల పవర్ షో.. ఊగిపోయిన ఉప్పల్.. క్రికెట్ ఫ్యాన్స్ కు పసందైన విందు

ఆ రెండు టీముల్లో నిండా హిట్టర్లే.. గ్రౌండ్​లోకి దిగితే పూనకాలే! ఇంకేముంది.. ఉప్పల్ వేదికగా సన్ ​రైజర్స్  హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్​కు పసందైన విందును అందించింది. బంతి గాల్లోకి లేచిన ప్రతిసారీ ఫ్యాన్స్ సీట్లలో నుంచి ఎగిరి గంతులేశారు. బాదడమే లక్ష్యంగా సాగిన ఈ పోరులో హైదరాబాద్ ఘనవిజయం సాధించడంతో ఆరెంజ్ ఆర్మీ సంబురాలు అంబరాన్నంటాయి.