ఏడుపొచ్చినా.. పట్టు వదల్లేదు : మనసును తాకే కరాటే కిడ్

ఏడుపొచ్చినా.. పట్టు వదల్లేదు : మనసును తాకే కరాటే కిడ్

ఏదైనా సాధించేదాకా మధ్యలో వదలొద్దు. పెద్దలు చెప్పే మాట ఇది. ఎన్ని కష్టాలొచ్చినా .. నష్టమొచ్చినా… అనుకున్న పని పూర్తయ్యేదాకా వదిలిపెట్టొద్దని అందరూ చెబుతుంటారు. కానీ ఆచరణలో పెట్టడమే కష్టంగా ఉంటుంది. అచ్చం.. దీనినే నిజం చేస్తూ.. ఓ వీడియో వైరల్ గా మారింది.

వీడియోలో ఉన్న చిన్నారి కరాటే కిడ్ పేరు ఫోయెనిక్స్. ఉండేది ఫ్లోరిడాలోని ఓర్లాండోలో. బాబీ డిగ్జాన్స్ అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో కరాటే నేర్చుకుంటున్నాడు. ఆరోజు క్లాస్ లో భాగంగా.. ఓ టైల్ ను కాలుతో తన్ని పగలగొట్టాలి. పాపం చిన్నోడు ఫోయెనిక్స్ ఒక్క షాట్ లో కొట్టలేకపోయాడు. కాలుతో పదే పదే పంచ్ లు ఇచ్చాడు. ఐనా.. అది బ్రేక్ కాలేదు. తన వల్ల కాదేమో అనుకుంటూ ఏడుపందుకున్నాడు.

చుట్టూ ఉన్న సహచరులు బాలుడిని బాగా ఎంకరేజ్ చేశారు. యు కెన్ డూ ఇట్.. కమాన్ అంటూ ప్రోత్సహించారు. కాలు ఇలా పెట్టు.. మడమతో తన్ను అంటూ కోచ్ సూచించాడు.  అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో… బాలుడు చివరకు… ఆ టైల్ ను బ్రేక్ చేశాడు. రెండు ముక్కలు చేశాడు. దీంతో.. ఒక్కసారిగా అతడి ముఖం వెలిగిపోయింది. తోటి స్నేహితులంతా… అతడి మీద పడి కంగ్రాట్స్ అంటూ మెచ్చుకున్నారు. ఏదో సాధించినవాడిలా.. ఆ చిన్నోడి ముఖంలో ఏడుపు స్థానంలో నవ్వు కనిపించింది.

ఈ వీడియోకు 5లక్షల షేర్లు

ఈ వీడియోలో మంచి మెసేజ్ ఉంది. అది మనసును తాకుతుంది. ఈ వీడియోను బాలుడి తల్లి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఈ వార్త రాసే సరికే వీడియోను ఐదున్నర లక్షల మంది షేర్ చేశారు. మూడున్నర లక్షల మంది లైక్ కొట్టారు.

చుట్టూ అందరూ సపోర్ట్ చేసే వారే ఉన్నప్పుడు.. ఆలోచనలు లక్ష్యం వైపుగా నడిపించినప్పుడు.. ఎవరైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరు అనడానికి ఇదో ఉదాహరణ.

My boy learned one of the most important lessons in his life today! NEVER.. EVER GIVE UP!!!Thank you Bobby Dixon and Erik Gianini for all that you do! AHOO!!!https://youtu.be/PbKeTBf03z4

Người đăng: Claudia Swonger vào Thứ Năm, 2 tháng 5, 2019