తాటిముంజలను ఎప్పుడూ. డైరెక్ట్ గా తినడమేగానీ దాంతో రెసిపీలెప్పుడూ ట్రై చేయలేదు కదూ? కానీ తాటిముంజలను టొమాటోలతో కలిపిచేసే కూర, మసాలాలు వేసి వండుకునే కుర్మా,నోట్లో వేస్తేనే కరిగిపోయే స్వీట్ పూరీ, రకరకాల ఫ్లేవర్లలో జ్యూస్లు కొన్నిప్రాంతాల్లో చాలా ఫేమస్. మరి ఈ వెరైటీ రుచుల్ని ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
సమ్మర్ వచ్చిందంటే మామిడి కాయలు ,పండ్లతో రకరకాల రెసిపీలు చేసుకుంటాం. అలాగే ఈ సీజల్లో దొరికే పుచ్చకాయతో రకరణాల జ్యూస్లు.. మిల్క్ షే కిలు చేసుకొని తాగుతాం. మరి తాటి ముంజలను మాత్రం గా తినడం ఎందురు? వాటితో కూడా రకరకాల రెసిపీలను తయారు చేసుకోవచ్చు. తాటి ముంజల వల్ల శరీరానికి పోషకాలు కూడా అందుతాయి.
తాటి ముంజలతో టొమాటో కూర తయారీకి కావలసినవి
- తాటి ముంజలు- నాలుగు
- టొమాటోలు- నాలుగు
- ఉల్లిగడ్డ- ఒకటి
- పచ్చిమిర్చి -నాలుగు
- నూనె- రెండు టేబుల్ స్పూన్స్
- తాలింపు గింజలు - స్పూన్
- పసువు-చిటికెడు
- కారం- టేబుల్ స్పూన్
- ఉప్పు-రుచికి సరిపడా
తాటి ముంజలతో టొమాటో కూర తయారీ విధానం
తాటి ముంజలపై నుంచి గోధుమరంగు పొట్టు తీసెయ్యాలి. లేతగా ఉంటే అక్కర్లేదు. చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి. కళాయిలో నూనె వేడిచేసి తాలింపు గింజలు వేయాలి.. తర్వాత సన్నగా తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి-ముక్కలు వేసి వేగించాలి.
కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తర్వాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలు వేసి అవి మెత్తబడేదాకా మూత పెట్టాలి. ఆతర్వాత కారం, ఉప్పు వేసి కొంచెం సేపు మూతపెట్టి ఉడికించాలి.
నూనె తేలుతున్నప్పుడు తరిగి పెట్టుకున్న తాటిముంజలు వేసి కలపాలి. సన్నటి మంట మీద ఐదు నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేయాలి ఈ కూర అన్నంతోపాటు చపాతీలు, పూరీలతో తిన్నా బాగుంటుంది.
తాటి ముంజల కుర్మా తయారీకి కావలసినవి
- తాటిముంజలు- నాలుగు
- నూనె- వేగించడానికి సరిపడా
- ఉల్లిగడ్డ- ఒకటి
- పచ్చిమిర్చి- నాలుగు
- తాలింపు గింజలు- స్పూన్
- లవంగాలు- రెండు
- ఇలాచీలు-రెండు
- దాల్చిన చెక్క- చిన్న ముక్క
- అల్లం వెల్లుల్లి పేస్ట్ -టేబుల్ స్పూన్
- నువ్వులు- రెండు టేబుకి స్పూన్స్
- జీడిపప్పు- రెండు టేబుల్ స్పూన్స్
- ఉప్పు- రుచికి సరిపడా
- కారం- తగినంత
- కొత్తిమీర- కొంచెం
తాటి ముంజల కుర్మా తయారీ విధానం
ఈ రెసిపీ చేయడానికి మందు తాటిముంజలు కావాలి. పొట్టు తీసి పొటాటో ముక్కల్లా కట్ చేయాలి. వాటిని నూనెలో వేగించాలి. మందపాటి అడుగు ఉన్న గిన్నెలో నూనె వేడిచేయాలి. అందులో తాలింపు గింజలు, రెండు లవంగాలు, రెండు ఇలాచీలు, దాల్చిన చెక్క వేయాలి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేగించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరికొంచెం సేపు వేగించాలి. ముందుగా వేగించి పెట్టుకున్న తాటిముంజల ముక్కలు వేయాలి.
తరువాత కారం, ఉప్పు వేయాలి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, మసాలాలు ముక్కలకు బాగా పట్టేవరకు కలుపుతూనే ఉండాలి. ముక్కలు రంగుమారేటప్పుడు జీడిపప్పు నువ్వులు గ్రేవీని వేసి బాగా కలపాలి. చిక్కగా ఉందనిపిస్తే కొంచెం నీళ్లు పోసి ఉడికించాలి.
చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కాసేపు సన్నటి మంట మీద ఉంచి దించేయాలి. ఘుమఘుమలాడే తాటి ముంజల కుర్మా రెడీ. బిర్యానీ, చపాతీ, పూరీలతో తినొచ్చు.
తాటి ముంజల బెంగాలీ మాల్ పువా తయారీకి కావలసినవి
- తాటిముంజల గుజ్జు - ఒక కప్పు
- గోధుమ రవ్వ - ఒక కప్పు
- గోధుమ పిండి / మైదా- ఒక కప్పు
- కొబ్బరి పొడి - రెండు టేబుల్ స్పూన్లు
- సోంపు - టేబుల్ స్పూన్
- చక్కెర- రెండు కప్పులు
- నూనె-- వేయించడానికి సరిపడా
బెంగాలీ మాల్ పువా తయారీ విధానం
తాటిముంజలతో చేసే ఈ రెసిపీ బెంగాలీలకు ఎంతో ఇష్టమైన వంటకం. సమ్మర్లో ప్రతి ఇంట్లో దీన్ని తప్పకుండా చేసుకుంటారు. తయారుచేసుకోవడం కూడా చాలా సింపుల్. చక్కెరలో సరిపడా నీళ్లుపోసి, తీగపాకం పట్టాలి..
ఒక గిన్నెలో తాటిముంజల గుజ్జు, బొంబాయి రవ్వ, గోధుమ పిండి (మైదా కూడా వాడొచ్చు ). కొబ్బరిపొడి, సోంపు వేసి నీళ్లు పోస్తూ దోశె పిండిలా జారుగా కలపాలి.
స్టవ్ మీద పాన్ పెట్టి కొంచెం నూనె పోసి, సెట్ దోశెల్లా వేయాలి. రెండువైపులా బాగా కాల్చి పక్కనే ఉన్న చక్కెర పాకంలో వేయాలి. పాకంలో పావుగంట ఉంచితే మాల్ పువా రెడీ.
