
న్యూఢిల్లీ: బడ్జెట్ ఇండ్ల సప్లై దేశంలోని ముఖ్య నగరాలన్నింటిలోనూ తగ్గుతూనే ఉంది. మొత్తం ఇండ్లలో రూ. 40 లక్షల కంటే తక్కువ ధరల ఇండ్ల వాటా -2018లో 40 శాతం ఉండగా, కిందటి ఏడాది 20 శాతానికి తగ్గింది.- రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ డేటా ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బడ్జెట్ధరల ఇండ్ల వాటా తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి. భూములు ధరలు మరింత పెరిగాయి. తక్కువ వడ్డీలకు లోన్లు దొరకడం లేదు. రా మెటీరియల్ రేట్లు పెరిగాయి. రియల్ ఎస్టేట్ డెవలపర్లు 2022లో 3,57,650 యూనిట్లను నిర్మించగా, ఇందులో 20 శాతం యూనిట్లు మాత్రమే తక్కువ ధర ఇండ్ల విభాగంలో ఉన్నాయి.
ఒక్కో యూనిట్‌కు రూ. 40 లక్షల కంటే తక్కువ ఖర్చవుతుంది. 2018లో ఏడు నగరాల్లో మొత్తం 1,95,300 యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో 40 శాతం యూనిట్లు బడ్జెట్ ధరల ఇండ్ల విభాగంలో ఉన్నాయి. 2019లోనూ 2,36,560 యూనిట్ల కొత్త లాంచ్‌లలో బడ్జెట్ ఇండ్ల సరఫరా వాటా 40 శాతంగా ఉంది. అయితే 2020లో మొత్తం1,27,960 యూనిట్లను అమ్మగా వీటిలో అఫర్డబుల్ సెగ్మెంట్ ఇండ్ల వాటా 30 శాతానికి పడిపోయింది. 2021 క్యాలెండర్ సంవత్సరంలో బడ్జెట్ ఇండ్ల విభాగంలో కొత్త లాంచ్‌ల వాటా 26 శాతానికి తగ్గిపోయింది. ఏడు నగరాల్లో 2021లో 2,36,700 యూనిట్లు అమ్మకానికి వచ్చాయి. కిందటి ఏడాది కూడా తగ్గుదల కొనసాగడంతో షేర్ 20 శాతానికి పడిపోయింది.
డెవలపర్లకు లాభం కూడా తక్కువే...
"తక్కువ ధర ఇండ్ల సంఖ్య తక్కువ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యమైన సమస్య భూమి. దీని ధర చాలా ఎక్కువయింది. డెవలపర్లు మిడిల్, ప్రీమియం హౌసింగ్‌తో తమ భూమి కొనుగోలు ఖర్చులను సులభంగా తిరిగి పొందవచ్చు. తక్కువ ధర ఇండ్ల విషయంలో కష్టం. ఈ సెగ్మెంట్ ఇండ్ల ప్రాజెక్ట్‌లలో లాభం, మార్జిన్లు ఇప్పటికే చాలా తక్కువగా ఉన్నాయి. ఇన్‌పుట్ ఖర్చులు (సిమెంట్, స్టీల్, లేబర్ మొదలైనవి) పెరుగుదల వల్ల బడ్జెట్ ఇండ్లను నిర్మించడం చాలా కష్టంగా మారింది’’ అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి చెప్పారు. ఢిల్లీ–-ఎన్‌సీఆర్‌కు చెందిన రియాల్టీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ మాట్లాడుతూ, "గత కొన్నేళ్లుగా ఇన్‌పుట్ ఖర్చులు, భూమి ధరలు రెండూ గణనీయంగా పెరగడం వల్ల సమస్యలు వస్తున్నాయి.
దీని వల్ల డెవలపర్లు ఈ కేటగిరీలో ప్రాజెక్ట్‌లను ప్రారంభించేందుకు అవకాశం లేకుండా పోయింది”అని ఆయన అన్నారు. సిగ్నేచర్ గ్లోబల్ తక్కువ ధర ఇండ్ల విభాగంపై ఫోకస్ చేస్తుంది. ప్రస్తుతం డిమాండ్ రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధర కలిగిన అపార్ట్‌మెంట్ల వైపు మళ్లిందని పురి చెప్పారు. గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేపై లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్న క్రిసుమి కార్పొరేషన్ ఎండీ మోహిత్ జైన్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలోని లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పెద్ద మార్పు వచ్చిందని, పర్యావరణానికి అనుకూలమైన ఇండ్ల కొనుగోలుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్నారు. ఇక నుంచి లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరుగుతూనే ఉంటుందని అభిప్రాయం