సూపర్​ ల్యాబ్స్​ డెస్క్​ తో ఎన్నో లాభాలు

సూపర్​ ల్యాబ్స్​ డెస్క్​ తో ఎన్నో లాభాలు

హైదరాబాద్​, వెలుగు: తాము అందుబాటులోకి తెచ్చిన ‘డెస్క్​’తో ఉద్యోగులకు, కంపెనీలకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నగరానికి చెందిన పరిశోధన -ఆధారిత డిజైన్ కంపెనీ సూపర్​ ఇన్నోవేటివ్ ల్యాబ్స్ ప్రకటించింది. దీనిని ఇన్​స్టాల్​ చేసుకున్న కంపెనీకి కరెంటు ఖర్చులు తగ్గుతాయని, కాలుష్యం బెడద ఉండదని తెలిపింది. సింగపూర్​లోని మొదటి సూపర్​ లో ఎనర్జీ బిల్డింగ్​ బీసీఏ బ్రాడ్‌‌డెల్ క్యాంపస్​లో  డెస్క్​ను విజయవంతంగా అమర్చామని ప్రకటించింది.

 సూపర్​ ఇన్నోవేటివ్ ల్యాబ్స్  ‘డెస్క్’​  కంపెనీల్లో కరెంటును ఆదా చేస్తుంది. కార్బన్​ ఫుట్​ప్రింట్​ను తగ్గిస్తుంది. వెలుతురు బాగా వచ్చేలా చూస్తుంది. దీనివల్ల ఉద్యోగుల ప్రొడక్టివిటీ పెరుగుతుంది.  యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, ఎస్​బీఐ, ఎయిర్‌‌టెల్,  ఎలిమెంటల్ రియాలిటీ- వంటి సంస్థలు తమ డెస్క్​ను ఉపయోగించుకుంటున్నాయని సూపర్​ల్యాబ్స్​ తెలిపింది.