కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ  వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ కు నిరాశ ఎదురయ్యింది.  సీబీఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. సీబీఐ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో   విచారణ సెప్టెంబర్‌ 5కు వాయిదా వేసింది.


లిక్కర్ స్కాం కేసులో ఈడీ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది. సీబీఐ కేసులో  బెయిల్ ఇవ్వాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేజ్రీవాల్. ఇవాళ పిటిషన్ ను జస్టిస్ సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను విచారించింది. ఈ సందర్భంగా సీబీఐకా వాలనే కౌంటర్ దాఖలు చేయడం లేదని  కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి అన్నారు. అయితే   కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీకి అవకాశం ఇస్తూ విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది సుప్రీం.

Also Read :- ఒడిశా అసెంబ్లీలో ఉద్రిక్తత