
ఢిల్లీ : ఏపీ, తెలంగాణ, తమిళనాడు హైకోర్టులకు చెందిన ఏడుగురు జడ్జిలను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టు నుంచి న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితను కర్ణాటక హైకోర్టుకు, జస్టిస్ నాగార్జున్ ను మద్రాసు హైకోర్టుకు, జస్టిస్ ఏ అభిషేక్ రెడ్డిని పట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ రెకమెండేషన్ చేసింది.
ఏపీ హైకోర్టు నుంచి న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ను మద్రాసు హైకోర్టుకు, జస్టిస్ డి. రమేష్ ను అలహాబాద్ హైకోర్టు కు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. మద్రాస్ హైకోర్టు నుంచి న్యాయమూర్తి జస్టిస్ వి.ఎం.వేలుమణిని కోల్ కతా హైకోర్టుకు, జస్టిస్ టి.రాజాను రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ చేయాలని రెకమెండేషన్ చేశారు.