జంట టవర్లను రెండు వారాల్లో కూల్చేయండి

జంట టవర్లను రెండు వారాల్లో కూల్చేయండి

నోయిడాలోని సూపర్‌టెక్ ఎమరాల్డ్ సంస్థకు చెందిన రెండు టవర్లను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సంస్థకు చెందిన 40 అంతస్తుల జంట టవర్లను రెండు వారాల్లో కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జంట టవర్ల కూల్చివేతకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు 72 గంటల్లోగా అన్ని సంబంధిత ఏజెన్సీల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నోయిడా సీఈవోను కోర్టు ఆదేశించింది. 

యూపీలోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భారీ జంట టవర్లను కూల్చివేయాలని గతంలోను సుప్రీంకోర్టు ఆదేశించింది. సూపర్‌టెక్‌ ఎమరాల్డ్‌ సంస్థ 40 అంతస్తులతో 2 టవర్లు నిర్మించింది. అయితే ఇవి నిబంధనలకు విరుద్ధమంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు జంట టవర్లను కూల్చివేయాలని ఆదేశించింది. మూడునెలల్లోపు కూల్చివేతలు పూర్తిచేయాలని.. దానికయ్యే ఖర్చునూ సూపర్‌టెక్‌ సంస్థ నుంచే వసూలు చేయాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు టవర్లలో దాదాపు వెయ్యి ప్లాట్లు ఉండగా.. ప్లాట్లు కొన్న వారందరికీ 12 శాతం వడ్డీతో నగదు తిరిగి చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే ఆదేశించింది.