
న్యూఢిల్లీ, వెలుగు: గ్రూప్ 1 నియామకాల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. గ్రూప్ 1 ర్యాంకర్ల నియామకాలపై తెలంగాణ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వేముల అనుష్ దాఖలు చేసిన పిటిషన్ ను గురువారం జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
ఇదే అంశంపై దాఖలైన రెండు ఎస్ఎల్పీలను తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్పోజ్ చేసింది. అయితే హైకోర్టు తుది తీర్పు కు అనుగుణంగానే నియామకాలు జరగాలని స్పష్టం చేసింది. తాజా ఈ పిటిషన్ లో సైతం అవే ఆదేశాలు జారీ చేసింది.