పదవీకాలం ముగిసినందున పిటిషన్ విచారించలేం : సుప్రీంకోర్టు

పదవీకాలం ముగిసినందున పిటిషన్ విచారించలేం : సుప్రీంకోర్టు
  • చెన్నమనేనిపై ఆది శ్రీనివాస్ పిటిషన్​ను కొట్టేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​పై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను విచారించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్యే పదవీ కాలం ముగిసినందున పిటిషన్‌‌‌‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ ఆది శ్రీనివాస్ గత 15 ఏండ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో భాగంగా, గతేడాది డిసెంబర్‌‌‌‌లో  హైకోర్టు ఆది శ్రీనివాస్‌‌‌‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 

హైకోర్టు రమేశ్ జర్మన్ పౌరుడని, ప్రభుత్వ పదవులకు అనర్హుడని ప్రకటించినప్పటికీ.. రెండవ అత్యధిక ఓట్లు సాధించిన తనను వేములవాడ ఎమ్మెల్యేగా అధికారికంగా ప్రకటించలేదని ఆది శ్రీనివాస్ గత నెల 19న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌‌‌‌ను శుక్రవారం జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌‌‌‌లతో కూడిన బెంచ్ విచారించింది. ఆ పదవీ కాలం ఇప్పటికే ముగిసినందున ఈ కేసును విచారించలేమని తీర్పు ఇచ్చింది. ఈ కారణాలతో పిటిషన్‌‌‌‌ను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది.