Supreme Court :చిన్నవయసు నుంచే లైంగిక విద్య బోధించాలి: సుప్రీంకోర్టు

Supreme Court :చిన్నవయసు నుంచే లైంగిక విద్య బోధించాలి: సుప్రీంకోర్టు

పాఠశాలల్లో లైంగిక విద్యా బోధనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పాఠశాలల్లో లైంగిక విద్యను చిన్న వయసులోనే ప్రారంభించాలని సూచించింది. కౌమారదశలో జరిగే శారీరక, భావోద్వేగ మార్పులను విద్యార్థులు అర్థం చేసుకునేందుకు లైంగిక విద్యను ప్రారంభ దశ నుండే పాఠశాల పాఠ్యాంశాల్లో భాగంగా చేర్చాలని  జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

విద్యార్థులకు లైంగిక విద్యను తొమ్మిదో తరగతి నుంచి కాకుండా చిన్న వయస్సు నుండే అందించాలని ..యుక్తవయస్సు తర్వాత జరిగే మార్పులపై అవగాహన, తీసుకోవలసిన జాగ్రత్తలు విద్యార్థులకు  తెలిపేందుకు అధికారులు దృష్టి పెట్టాలని అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

పోక్సో యాక్టు కింద శిక్ష అనుభవిస్తున్న 15 ఏళ్ల బాలుడికి హైకోర్టు బెయిల్ నిరాకరించినకేసులో దాఖలైన పిటిషన్ నువిచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ బాలుడు మైనర్ అని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు..సెప్టెంబర్‌లో జువెనైల్ జస్టిస్ బోర్డు విధించే షరతులకు లోబడి బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది.వి

చారణ సందర్భంగా ఉన్నత పాఠశాలల్లో లైంగిక విద్య అమలును వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా కోర్టు ఆదేశించింది.