కరోనా మళ్లీ విజృంభించడంపై సుప్రీంకోర్టు అసహనం

కరోనా మళ్లీ విజృంభించడంపై సుప్రీంకోర్టు అసహనం

మహమ్మారిని కట్టడి చేసేందుకు ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం

న్యూఢిల్లీ: తగ్గినట్లే తగ్గి.. మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోవిడ్ మహమ్మారి విస్తరించకుండా కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదికలు అందించాలంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా గుజరాత్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా  మళ్లీ విజృంభిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చలికాలం వైరస్ వ్యాప్తి కి అనుకూలమైన వాతావరణం ఉందన్న వైద్య నిపుణుల హెచ్చరికలు.. డిసెంబరులో కరోనా మరింత తీవ్ర రూపం దాల్చనుందన్న వార్తల నేపథ్యంలో పరిస్థితులు దిగజారకముందే జాగ్రత్తపడాలని రాష్ట్రాలకు సూచనలు చేసింది. అలాగే కరోనా ను  ఎదుర్కునేందుకు  కేంద్రం నుంచి ఎటువంటి సాయం కోరుకుంటున్నాయో కూడా నివేదికలో తెలియజేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రెండు రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్రాలకు స్పష్టం చేస్తూ.. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, ఆర్‌ఎస్‌ రెడ్డి, ఎంఆర్‌ షా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది.

for more News….

సెప్టెంబర్‌ వర‌కు 25 కోట్ల మందికి వ్యాక్సిన్

కరోనా టీకా ట్రాన్స్ పోర్ట్ కు విమానాలు రెడీ

మనోళ్లపై ‘స్పుత్నిక్-V’ ట్రయల్స్.. మూడ్రోజుల్లో స్టార్ట్

ఆక్స్‌‌ఫర్డ్‌‌ వ్యాక్సిన్​ కోసం పేద దేశాలు వెయిటింగ్​