రేపటి నుంచి సుప్రీం కోర్టు జడ్జీలకు కరోనా వ్యాక్సిన్

రేపటి నుంచి సుప్రీం కోర్టు జడ్జీలకు కరోనా వ్యాక్సిన్

దేశంలో రెండో దశ కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఇవాళ్టి(సోమవారం) నుంచి ప్రారంభమైంది. రేపు(మంగళవారం) సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు టీకా ఇవ్వనున్నారు. ఇందుకోసం కోర్టు ఏరియాలో ప్రత్యేక వ్యాక్సినేషన్‌ సెంటర్ ఏర్పాటు చేసినట్లు కోర్టు రిజిస్ట్రీ వర్గాలు తెలిపాయి. జడ్జీలతో పాటు వారి కుటుంబసభ్యులకు కూడా వ్యాక్సిన్లు వేయనున్నట్లు తెలిపింది.

రెండోదశలో భాగంగా 60ఏళ్లు పైబడిన వారికి, 45-59 ఏళ్ల మధ్య వయస్కుల్లో దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారికి సోమవారం నుంచి వ్యాక్సిన్లు ఇస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్  ఆస్పత్రుల్లో టీకాలను అందుబాటులోకి తెచ్చారు.