భర్త సోదరుడు నుంచి కూడా భరణం కోరచ్చు: సుప్రీం

భర్త సోదరుడు నుంచి కూడా భరణం కోరచ్చు: సుప్రీం
  • కుటుంబం అంతటికీ ‘గృహహింస’ వర్తిస్తుంది
  • ఇంట్లో మగాళ్లందరికీ బాధ్యత ఉంటుందన్న సుప్రీం

న్యూఢిల్లీ: గృహహింస చట్టం కింద బాధితురాలికి భర్త సోదరుడి నుంచి భరణం కోరే హక్కు ఉంటుందని ఆదివారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భర్త కుటుంబంలోని పురుష సభ్యుల్లో ఏ ఒక్కరికీ ఈ చట్టం నుంచి మినహాయింపు ఉండదని జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోని బెంచ్ తీర్పిచ్చిం ది. భర్త చనిపోవడంతో భర్త సోదరుడి నుంచి తనకు, తన కుమారుడికి జీవన భృతి ఇప్పించాలంటూ కోర్టుకెక్కిన బాధితురాలికి అనుకూలంగా తీర్పిచ్చింది. గృహహింస చట్టంలోని  సెక్షన్ 2(క్యూ )ప్రకారం.. భర్తతో పాటు కుటుంబంలోని పురుష సభ్యులు అందరికీ బాధ్యత ఉంటుందని చెబుతోందని జస్టిస్ వ్యాఖ్యానిం చారు. ఒకే కుటుంబంగా కలిసి ఉన్నపుడు బాధ్యతను కూడా పంచుకోవాలంటూ తేల్చి చెప్పారు . వారిపై కేసు పెట్టే అవకాశాన్నీ ఈ చట్టం బాధితురాలికి కల్పిస్తోం దని అన్నారు.

భర్త చనిపోవడంతో నిరాధారంగా మారిన తనకు భర్త సోదరుడి నుంచి భృతి ఇప్పించాలంటూ పంజాబ్ కు చెందిన ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. భర్త జీవించి ఉన్నపుడు కుటుంబం మొత్తం ఉమ్మడిగా ఉండేదని, కుటుంబ వ్యా పారాన్ని ఉమ్మడిగా నిర్వహిస్తూ లాభాలు పంచుకునే వారని కోర్టుకు విన్నవించింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న పంజాబ్ హై కోర్టు బాధితురాలికి భరణం చెల్లించడం సబబేనంటూ తీర్పు  వెలువరించిం ది. అయితే దీనికి న్యాయపరంగా ఎలాంటి ఆధారం(లాఫుల్ బేసిస్) లేదంటూ ప్రతివాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణలో గృహహింస చట్టం ప్రకారం భర్త కుటుంబ సభ్యులందరికీ బాధ్యత ఉంటుందని చెబుతూ సుప్రీం బెంచ్ కింది కోర్టు తీర్పును సమర్థించింది. సోదరుడి భార్యకు నెలకు రూ.4 వేలు, కొడుకుకు రూ.2 వేలు భరణంగా చెల్లించాలంటూ తీర్పిచ్చింది.