మహారాష్ట్ర ఎమ్మెల్యేల సస్పెన్షన్‎ను కొట్టేసిన సుప్రీంకోర్టు

మహారాష్ట్ర ఎమ్మెల్యేల సస్పెన్షన్‎ను కొట్టేసిన సుప్రీంకోర్టు

మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‎ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్దమని, ఏకపక్ష నిర్ణయమని కోర్టు వ్యాఖ్యానించింది. స్పీకర్‌ ఛాంబర్‌లో ప్రిసైడింగ్‌ అధికారి భాస్కర్‌ జాదవ్‌తో అనుచితంగా ప్రవర్తించారని వీరందని ఒక ఏడాది పాటు సస్పెండ్ చేయాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ  తీర్మానం చేసింది.  ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ తీర్మానాన్ని రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనిల్‌ పరబ్‌ ప్రవేశపెట్టగా.. మూజువాణి ఓటుతో ఆమోదించారు. దాని ప్రకారం 12 మంది ఎమ్మెల్యేలను గత ఏడాది జూలై 5న అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ నిర్ణయాన్ని కోర్టు తప్పుబట్టింది. అసెంబ్లీ తీర్మానాలు చట్టం దృష్టిలో ద్వేషపూరితమైనవి, అసమర్థమైనవని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎమ్మెల్యేలు సంజయ్ కుటే, ఆశిష్ షెలార్, అభిమన్యు పవార్, గిరీష్ మహాజన్, అతుల్ భత్ఖల్కర్, పరాగ్ అలవానీ, హరీష్ పింపాలే, యోగేష్ సాగర్, జై కుమార్ రావత్, నారాయణ్ కుచే, రామ్ సత్పుటే మరియు బంటీ భాంగ్డియాలపై సస్పెన్షన్ తక్షణమే ఎత్తేయాలని కోర్టు సూచించింది.

కాగా.. కోర్టు తీర్పు పట్ల మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్దమని తాము ముందునుంచే చెబుతున్నా.. పట్టించుకోలేదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం గెలిచిందని ఆయన అన్నారు.

For More News..

ఓయూలో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల బందోబస్తు

పుష్ప డైలాగ్‎తో అదరగొట్టిన ‘ది గ్రేట్ కాళీ’