
చట్టం రాజ్యాంగబద్ధతను సమర్థించిన సుప్రీంకోర్టు
ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు ప్రాథమిక విచారణ అవసరం లేదు
అసాధారణ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చని కామెంట్
పిటీషన్లన్నీ కొట్టేసిన ముగ్గురు జడ్జిల బెంచ్
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్–2018 రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అసాధారణ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చని చెప్పింది. నిందితులపై మోపిన ఆరోపణలు ప్రాథమిక విచారణలో రుజువు కానప్పుడు మాత్రమే యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వొచ్చని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ రవీంద్ర భట్ల బెంచ్ సోమవారం స్పష్టం చేసింది. అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు ప్రాథమిక విచారణ, పోలీస్ సీనియర్ అధికారుల అప్రూవల్ అవసరం లేదని చెప్పింది. ఎస్సీ, ఎస్టీ సవరణ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిల్స్‌పై తీర్పు సందర్భంగా సుప్రీం ఈ కామెంట్స్ చేసింది. పిటిషన్లన్నింటినీ కొట్టేసింది. చట్టం గతంలో మాదిరే యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరు తోటి పౌరులను సమానంగా చూసుకోవాలని, సోదర భావనను పెంచుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ రవీంద్ర భట్ సూచించారు. ఎస్సీ/ఎస్టీ చట్టం ప్రకారం ప్రాథమిక విచారణలో ఆరోపణ రుజువుకాకపోతే.. ఎఫ్ఐఆర్ ను కోర్టు రద్దు చేయవచ్చని చెప్పారు.
గతంలో ఏం చెప్పిందంటే…?
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని కొందరు దుర్వి నియోగం చేస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రవేటు వ్యక్తులను వేధిస్తున్నారని.. ఈ చట్టం కింద కేసు నమోదు చేయగానే వెంటనే అరెస్టులు చేయకూడదని, పోలీసులు విచారణ జరపాలని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని 2018 మార్చి 20న
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిం ది. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. హింస చెలరేగింది. దీంతో ఎస్సీ, ఎస్టీ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ) చట్టాన్ని యథావిధిగా ఉంచు తూ కేంద్రం లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టింది. దాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తర్వాత 2018 మార్చి 20న ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం ఆశ్రయించింది. విచారణ జరిపిన కోర్టు 2019 అక్టోబర్ 1న తన గత ఆదేశాలపై స్టే విధించింది. తర్వాత ఎస్సీ, ఎస్టీ అమెండ్ మెంట్ యాక్-2ట్ 018 చట్టబద్ధతను ప్రశ్నిస్తూ కొందరు వ్యక్తులు పిల్స్ వేశారు.