యూపీ మదర్సా చట్టం రద్దు కేసులో..సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

యూపీ మదర్సా చట్టం రద్దు కేసులో..సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ఉత్తరప్రదేశ్ మదర్సాచట్టం రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం (ఏప్రిల్ 5) నిలిపివేసింది. 17లక్షల మంది విద్యా ర్థులు, 10వేల మంది టీచర్లను రాష్ట్ర విద్యావ్యవస్థలో సర్దుబాటు చేయాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. 

గతనెలలో (మార్చి2024) ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ చట్టంపై కీలక తీర్పునిచ్చింది. ఈ చట్టం సెక్యులరిజాన్ని ఉల్లంఘించినట్లు ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ విద్యావిధానంలో వీరికి విద్యావసతులు కల్పించాలని హైకోర్టు కోరింది. 

మదర్సా చట్టంలోని నిబంధనలను హైకోర్టు తప్పుగా అర్థం చేసుకుందని, మతపరమైన బోధనకు అవకాశం లేదని కోర్టు తెలిపింది. మదర్సా బోర్డు లక్ష్యం, ఉద్దేశ్యం లౌకిక వాదానికి విఘాతం కలిగిస్తుందని.. బోర్డు ఏర్పాటు ప్రాథమికంగా సరైంది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రి సభ్య ధర్మాసనం కేంద్రానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు చేసింది.